ఆర్‌సిఎం చర్చి అభివృద్ధికి వంశీ రూ.లక్ష విరాళం
ప్రజాశక్తి-గన్నవరం
బడుగు వర్గాల వ్యక్తిగత అభ్యున్నతికే కాదు.. వారు ఎంతో ప్రేమతో..నమ్మకంతో.. ఇష్టపడి ఆరాధన చేయడానికి వెళ్తున్న దేవుని పవిత్ర స్థలమైన చర్చిల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గన్నవరం ఎమ్మెల్యే వంశీ చేస్తున్న కృషి ఆనిర్వచనీయమని బాపులపాడు పిఎసిఎస్ అధ్యక్షులు యర్రంశెట్టి రామాంజనేయులు అన్నారు. బొమ్ములూరు గ్రామంలో ఆర్‌సిఎంచర్చి అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీ ఇచ్చిన రూ.లక్ష సొమ్మును శుక్రవారం చర్చి నిర్వాహకులకు గన్నవరం ఎమ్మెల్యే కార్యాలయంలో యర్రంశెట్టి చేతుల మీదుగా నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్ములూరుకు చెందిన దైవజనులు, గ్రామ బడుగు వర్గాల పెద్దలు, క్రిస్టియన్ సోదరులు అడిగినంతనే సహృదయంతో స్పందించి చర్చిల అభివృద్ధికి సొంత నిధులు లక్షలాది రూపాయలు ఇచ్చినట్టు చెప్పారు. ఆర్సీఎం చర్చి పెద్దలు, చర్చి సభ్యులు డాక్టర్ వంశీ చేయూత అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బొమ్మలూరు గ్రామ అభివృద్ధికి, అడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పుడూ సహాయం చేయడానికి తాను ముందు ఉంటానని ఎమ్మెల్యే వంశీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎఎంసి సభ్యులు గండేపూడి రాణి, గ్రామ పార్టీ నాయకులు ముసునూరి కృష్ణారావు, గండేపూడి వీరయ్య, కుందేటి రాంబాబు, పచ్చిగళ్ళ యోహాను, పచ్చిగళ్ళ బర్నబాస్, పచ్చిగళ్ళ రంగారావు, కోలంటి శౌరి, పైడిముక్కల ఆశీర్వాదం, గాలంకి వినరు, పచ్చిగళ్ళ శ్రీనివాస రావు, కోలంటి రమేష్, గ్రామస్తులు ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.










