ప్రజాశక్తి-యర్రగొండపాలెం : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే వైద్యాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని డిఎల్‌డిఒ సాయికుమార్ తెలిపారు. యర్రగొండపాలెం-2 సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పేద ప్రజలకు వరమని అన్నారు. కార్పొరేటు వైద్యానికి దీటుగా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి చేదూరి విజయభాస్కర్, వైసిపి మండల కన్వీనర్ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, ఎంపిడిఒ నాగేశ్వర ప్రసాద్, ఇఒఆర్‌డి ఈదుల రాజశేఖర్‌రెడ్డి, సర్పంచి రామావత్ అరుణాబాయి, అంగన్‌వాడీ వైజర్ పద్మజ, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్‌కోటా నాయక్, డాక్టర్ సయ్యద్ నాయబ్ రసూల్, డాక్టర్ చైతన్య, అంగన్‌వాడీ, వైద్య, ఆశా, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దర్శి :జగనన్న సురక్ష పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శామంతపూడి సర్పంచి అమరా కన్నమ్మ, జముకులదిన్నె సర్పంచి సత్యనారాయణ తెలిపారు. మండల పరిధిలోని శామంతపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసిపి నాయకుడు మందాడి శ్రీనివాసరావు, ఇఒఆర్‌డి శోభన్‌బాబు, పంచాయతీ కార్యదర్శి నాయక్, మీరాబి, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. పుల్లలచెరువు : మండల పరిధిలోఏని పిడికిటివారిపల్లె గ్రామ సచివాలయం వద్ద గ్రామ సర్పంచి నారు మస్తాన్‌రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి వాగ్య నాయక్, వైసిపి మండల కన్వీనర్ బోగోలు వెంకట సుబ్బారెడ్డి, తహశీల్దార్ దాస్, ఎంపిడిఒ మరియదాస్, ఎంఇఒ- 2 ఇందిర ప్రసాద్, ప్రభుత్వ వైద్యులు, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కనిగిరి : మండల పరిధిలోని చాకిరాల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి మడతల కస్తూరి రెడ్డి, ఎంపిపి దత్తులూరు ప్రకాశం మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష పథకం పేదలకు వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ మల్లికార్జునరావు, ఇఒఆర్‌డి ఒంగోలు అన్నమ్మ, అంగన్‌వాడీలు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










