ప్రజాశక్తి - సాలూరురూరల్ : ప్రజలందరి ఆరోగ్య రక్షణే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలోని అన్నంరాజువలసలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ శిబిరాలు నిర్వహిస్తారన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి నిపుణులైన వైద్యులతో సత్వర చికిత్స అందుబాటులోకి వస్తుందని, ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన గర్భిణీలకు సీమంతల కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సీమల రాములమ్మ, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, ఎఎంసి చైర్ పర్సన్ దండి అనంత కుమారి, వైసిపి మండల అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీనివాసరావు, వైసిపి నాయకులు దండి శ్రీనివాసరావు, డిప్యూటీ డిఎంహెచ్ శివకుమార్, మామిడిపల్లి పిహెచ్‌సి వైద్యులు కనకాల శ్రీకాంత్, సర్పంచులు, ఎంపిటిసిలు, వైద్య, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
పాచిపెంట :మండలంలోని విశ్వనాధపురంలో డిప్యూటీ సీఎం పి రాజన్న దొర జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష శిబిరాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి బి ప్రమీల, వైసిపి మండల కన్వీనర్ గొట్టాపు ముత్యాల నాయుడు, సర్పంచ్ సత్యవతి, వైసిపి నాయకులు దండి ఏడుకొండలు, పాచిపెంట వీరమనాయుడు, ధనుంజయరావు, డిఎం హెచ్‌ఒ బి.జగన్నాథరావు, వైద్య అధికారులు పాల్గొన్నారు.
జియ్యమ్మవలస : జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జియమ్మవలస మండలం టికె జమ్ములో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల వద్ద రిసెప్షన్, మందులు, పరీక్షలు, రోగుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. మండల పరిశీలన అధికారి ఎండి నాయక్, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.
మక్కువ : మండలంలోని వెంకట భైరపురం పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పీ రాజన్న దొర ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్, జడ్పిటిసి సభ్యులు ఎం శ్రీనివాసరావు, పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ హరికష్ణ స్థానిక సర్పంచ్ ఎం వెంకటరత్నం, మండల వైసీపీ నాయకులు, ఎంపిడిఒ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని పి.ఆమిటిలో నిర్వహించిన జగనన్న సురక్ష వైద్య శిబిరానికి గిరిజనుల నుంచి మంచి స్పందన వచ్చింది. జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి పరిశీలన అధికారి గిరి వెలుగు ఏపిడి వై సత్యం నాయుడు, ఎంపిడిఒ సాల్మన్ రాజు, డిప్యూటీ తాసిల్దార్ రాజేంద్ర, ఐసిడిఎస్ పిఒ సుశీలదేవి తదితర శాఖల అధికారులు , వైద్య సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయి ఆరోగ్య భరోసా జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పట్టణంలోని 1,2,3,4,13,14,15 వార్డు సచివాలయాల పరిధిలో గల జగన్నాధపురంలో ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బి గౌరీశ్వరి, వైస్ చైర్మన్ కొండపల్లి రుక్మిణి, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకష్ణ, ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు, ఎన్‌జిఒ ప్రెసిడెంట్ కిషోర్, వైధ్యాధికారులు, వైద్యులు, వైసిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని బూర్జ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే ఎ.జోగారావు పరిశీలించారు. ఆర్డీవో హేమలత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎంఎల్‌ఎస్‌ఎన్ ప్రసాద్, ఎంఇఒ జి.సూరిదేముడు, పెదంకలాం, సీతానగరం వైద్యాధికారులు ఎం.రాధాకాంత్, కె.శిరీష, డిఐఒ టి.జగన్మోహన్‌రావు, గ్రామ సర్పంచ్ దాసు, జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, ఎంపిపి బి.రమణమ్మ శ్రీరాములు నాయుడు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులతో పాటు వైద్య సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.
పాలకొండ : మండలంలోని లుంబూరులో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పి.విక్రాంత్ ప్రారంభించారు. వైద్యశిబిరంలో జనరల్ ఫిజీషియన్లు, గైనకాలజిస్ట్, ఆర్థో విభాగాలకు చెందిన వైద్యులు రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో బొమ్మాళి భాను, శ్రీ కణపాక సూర్య ప్రకాష్, వాకముడి అనిల్, తిర్లంగి ఉపేంద్ర, పడాల రామచంద్రరావు, ఎస్.అప్పారావు, రౌతు వాసుదేవరావు గారు పాల్గొన్నారు.
రోగుల పాట్లు
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం స్థానిక నగర పంచాయతీ పరిధిలో జరిగింది. అయితే అక్కడకు వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు. తగిన విధంగా ఏర్పాట్లు చేయకపోవడంతో వారు ఇబ్బందుల పాలయ్యారు. కనీసం కూర్చొవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. కేవలం ముగ్గురు వైద్యులతో మమా అనిపించారు. వచ్చిన రోగులు వైద్యం కోసం క్యూ ల్కెన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
వీరఘట్టం : స్థానిక సచివాలయం-3లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు ప్రారంభించారు. తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్యాధికారుల జి ప్రదీప్ కుమార్ ఎన్ మానస, చిన్నపిల్లల వైద్య నిపుణులు వీణ సరస్వతి, ఎండి ఎన్ ప్రేమ్చంద్ జనరల్ మెడిసన్, ఎంపిడిఒ జిజె ప్రసాదు, ఎఒ వై వెంకటరమణ, మేజర్ పంచాయతీ ఈవో రామచంద్రరావు, ఎన్‌ఎంలు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మండలంలోని విక్రమపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మల్లికార్జునరావు వైద్యశిబిరాన్ని పరిశీలించారు. శిబిరంలో స్థానిక వైద్య అధికారి అరుణ్ కుమార్, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సుకుమార్ బాబు, జిల్లా కంటి వెలుగు సెల్ నేత్ర వైద్యాధికారి జీరు నగేష్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










