Sep 19,2023 19:39

దీక్షల్లో నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఆదోనిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ఆరో రోజూ రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలో ఎంఎస్పీ మండల నాయకులు బైచిగేరి తిమ్మన్న, ఎంఆర్‌పిఎస్‌ టౌన్‌ నాయకులు సప్పాగు రామాంజి, మండల నాయకులు కంగారి సుధాకర్‌, టౌన్‌ నాయకులు వడ్డేమాన్‌ నాగరాజు దీక్షల్లో కూర్చున్నారు. ఎంఆర్‌పిఎస్‌ సీనియర్‌ నాయకులు పి.గోవిందరాజులు, ఎంఎస్పీ జిల్లా కోకన్వీనర్‌ బండారి హనుమంతు, జిల్లా నాయకులు పిఎస్‌.వీరేష్‌, ఎంఆర్‌పిఎస్‌ పట్టణ మాజీ అధ్యక్షులు మాదాస్‌ జగన్‌, టౌన్‌ నాయకులు వి.మణికంఠ, మన్మోహన్‌ దీక్షలను ప్రారంభించారు. దీక్షకు మానిటరింగ్‌ కమిటీ సభ్యులు ప్రసాద్‌, టిడిపి ఎస్సీ సెల్‌ నాయకులు అమర్‌ ప్రకాష్‌ సంఘీభావం తెలిపారు. 18 నుంచి 22 వరకు జరిగే అమృత కాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ ఎంపీలతో పార్లమెంట్‌లో ఎస్సీ బిల్లు ప్రస్తావన చేయించాలన్నారు. ఎంఆర్‌పిఎస్‌ మండల అధ్యక్షులు బండారి గిడ్డయ్య, శివ, పర్ష పాల్గొన్నారు.