Jul 24,2023 19:12

అర్జీలు స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - ఆదోని
స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. సోమవారం స్పందనలో డివిజన్‌లోని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయిలో పూర్తయ్యే సమస్యలు డివిజన్‌ స్థాయి వరకు రాకుండా చూసుకోవాలన్నారు. గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లకుండా చూడాలన్నారు. పరిపాలన అధికారి గోవింద్‌ సింగ్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణు సూర్య, వ్యవసాయ శాఖ ఎడి గిరీష్‌ కుమార్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ చేతన్‌ ప్రియా, మత్స్యశాఖ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, ఆర్‌టిసి డిపో మేనేజర్‌ మహ్మద్‌ రఫీ పాల్గొన్నారు.