Oct 19,2023 23:27
సచివాలయం భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కుందురు

ప్రజాశక్తి-కొనకనమిట్ల: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే గడప గడపకూ మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని గొట్లగట్టులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ అక్క చెల్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, వాలంటీర్లు మీ ఇళ్లకు వచ్చి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారా అని ఆరా తీశారు. వాలంటీర్లు అందుబాటులో లేకపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందకపోతే అధికారులకు తెలియజేయాలని కోరారు. అనంతరం గొట్లగట్టులో రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాసమూర్తి, వ్యవసాయాధికారి లకీëప్రసన్న, పశువైద్యాధికారి రాజ్యలక్ష్మి, ఎపిఎం గోపాలకృష్ణారెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, జడ్‌పిటిసి అక్కిదాసరి ఏడుకొండలు, ఎంపిటిసి ఉడుముల రామనారాయణరెడ్డి, ఉపసర్పంచ్‌ గాడి కోనేటిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు కాశిరెడ్డి, కామసాని వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచులు బత్తుల మాలకొండయ్య, బాలగురవయ్య, మాజీ ఎంపీటీసీలు గోనుగుంట్ల శ్రీనివాసులు, ఉప్పుటూరి వెంకటయ్య, నాయకులు పోలసాని నారాయణరెడ్డి, కె డేవిడ్‌, చలమారెడ్డి, నాగం ప్రసాద్‌, సుబ్బయ్య, అంజయ్య, సుబ్బారెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.