రికార్డులు పరిశీలిస్తున్న ఛైర్‌పర్సన్
ప్రజాశక్తి- హిందూపురం : సచివాలయాల పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ సచివాలయ సెక్రటరీలకు ఆదేశించారు. సోమవారం పురపాలక సంఘ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో ఉన్నా 36, 37 సచివాలయాలను ఆమె ఆకస్మిక తనఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా సచివాలయంలో సెక్రేటరీల హాజరు పట్టికను తనఖీ చేసి, ఎంత మంది హాజరయ్యారో రోజు ఎంత మంది ఏఏ సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారో చెప్పు అనే పరిస్థితి దాపురించిందని అన్నారు. తనఖీల్లో ఈమె వెంట యువజన విభాగం జిల్లా అధ్యక్షులు వాల్మికి లోకేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.










