టి.నరసాపురం : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్నామని పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని రాజుపోతే పల్లిలో ప్రజల వద్దకు వెళ్లి, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం 200 రోజులు పూరైన సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు, ఎంపీపీ డి.లక్ష్మి వెంకటేశ్వరరావు, కె.జగ్గవరం సొసైటీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి మధు, సర్పంచి బొంతు రమాదేవి, అంజిబాబు, ఎంపిటిసి రాంబాబు పాల్గొన్నారు.










