Sep 05,2023 17:59

ప్రజాశక్తి - టి.నరసాపురం
    అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు తెలిపారు. మండలంలోని వెలగపాడు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న బాలరాజు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి మధు, ఎంపీపీ డి.లక్ష్మీ, తుమ్మూరి శ్రీనివాసరెడ్డి, మండల యూత్‌ అధ్యక్షులు కన్నం సర్వేశ్వరావు, ఉమ్మడి తేజ, గంగరాజు, యర్రా గంగాధరావు, బొడ్డు శ్రీను పాల్గొన్నారు.