అర్హులందరికీ సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - నంద్యాల
అర్హూలందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు పోలీస్ క్వార్టర్స్, సరస్వతి నగర్‌లో వార్డు ఇన్చార్జ్ సాయిరాం రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 109వ రోజు లబ్ధిదారులకు పథకాల కరపత్రాలను అందించారు. వార్డు ప్రజలు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసిపి నాయకులు జమాల్, శ్రీను, భాస్కర్, సంపత్, షాకీర్, లక్ష్మీదేవి, ఫాతిమా, గిరి, సోమశేఖర్ రెడ్డి, రహంతుల్లా, అమృతరాజు, అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
బేతంచర్ల:రాష్ట్రంలో అర్హూలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బేతంచెర్ల మండల పరిధిలోని అంబాపురం గ్రామంలో వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి, బాబుల్ రెడ్డి అంబాపురం గ్రామం ప్రజలతో కలిసి మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి లబ్ధి పొందుతున్న పథకాలను ఎంపిపి వివరించారు. రాబోయే కాలంలో వైఎస్‌ఆర్ పార్టీని ఆదరించాలని కోరారు. వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు మురళీకృష్ణ వైసీపీ రంగస్వామి, గూని నాగరాజు, రామళ్లకోట కృష్ణుడు, తిరుమలేశ్వర్ రెడ్డి, ఎద్దులన్న, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు ,మద్దయ్య, తిమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.










