ప్రజాశక్తి కదిరి టౌన్ : వైసిపి ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. కదిరి మున్సిపాలిటీ నిజాంవలి కాలనీ వార్డు సచివాలయం, 15 వ వార్డు పరిధిలోని షేకుసెంటర్, రెక్కమాను వీధి, నిజాంవలి కాలనీలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, జెసిఎస్ ఇన్చార్జులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










