Sep 14,2023 20:48

పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎంపిపి అన్నాజీరావు

ప్రజాశక్తి - కురుపాం: వైసిపి ప్రభుత్వంలోనే అర్హులందరికీ పింఛను అందుతుందని వైస్‌ ఎంపిపి బి.అన్నాజీరావు అన్నారు. మండలంలోని నీలకంఠాపురం సచివాలయం వద్ద గురువారం కొత్తగా మంజూరైన పెన్షన్లు పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వృద్ధ, వికలాంగ, వితంతువులకు నేరుగా పెన్షన్‌ మంజూరు ఇటువంటి ప్రలోభాలకు తోవ లేకుండా ఒక్క వైసిపి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. మొండెంఖల్‌ సచివాలయంలో సర్పంచ్‌ ఐ.గౌరీశంకర్‌ కొత్తగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెన్షన్‌ రావాలంటే ఎన్నో తిప్పలు పడేవారని, కానీ ఇప్పుడు నేరుగా వాలంటీరు వచ్చి అర్హులకు పెన్షన్‌ అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ ఎ.మన్మధరావు, ఎంపిటిసి జి.విధ్యా రాణి, వైసిపి నాయకులు ఐ.రామకృష్ణ, సత్తిబాబు, బిడ్డిక అనంత్‌, వెల్పేర్‌ అసిస్టెంట్ల్లు బి. ఆనంద్‌ బి కొండలరావు పాల్గొన్నారు.