సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి - కదిరిఅర్బన్ : అర్హులందరికీ గృహ సౌకర్యం కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎంపిపిలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యకర్తలు, అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పక్కాగృహాలు మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. మొదట ప్రాధాన్యతగా జగనన్న హౌసింగ్ కాలనీలో మంజూరైన ఇంటి నిర్మాణాలను చేపట్టాలన్నారు.. జగనన్న కాలనీలో ఇష్టం లేని వారికి పట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి కి ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.










