Sep 10,2023 21:28

మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

          ప్రజాశక్తి-అనంతపురం   వైసిపి అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రా లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు క్షేమ ంగా ఉన్నారన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇదే విషయాన్ని చెబుతున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ పథకాలు నేరుగా ఇళ్లవద్దకు చేర్చిన దాఖలాలు లేవన్నారు. తరచూ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇళ్లకు తిరుగుతూ ప్రజలు యోగక్షేమాలు అడుగుతు న్నారు. రాజకీయ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాలంటే పచ్చ కండువా కప్పుకోవాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు ఒప్పుకుంటేనే పథకాలు వచ్చేవన్నారు. మండల స్థాయి అధికారులు చెప్పినా ఉపయోగం ఉండేది కాదన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని ప్రజలే చెబుతున్నారన్నారు. వలంటీర్లకు వివరాలు అందజేస్తే వారే పథకాలు వచ్చేలా చూస్తున్నారన్నారు. ఇంతకంటే మాకు ఏం కావాలని గ్రామాల్లో మహిళలు చెబుతున్నారు. అనంతరం మండ్ల సుబ్బారెడ్డి కాలనీలో నూతనంగా సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అలాగే నందమూరి నగర్‌లో గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. నందమూరి నగర్‌లో సుంకులమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళంగా అందజేశారు. అలాగే మసీదు మరమ్మత్తు కోసం అవసరమైన సామగ్రిని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మండల కన్వీనర్లు, ఎంపిపిలు, జెడ్పీటీసీలు, వైస్‌ ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఛైర్మన్లు, డైరెక్టర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.