Oct 20,2023 22:33

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ వార్షికోత్సవంలో హీరోయిన్‌ అనుపమ

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో దసరా ఆఫర్లు
వార్షికోత్సవ వేడుకల్లో హీరోయిన్‌ అనుపమ
ప్రజాశక్తి- తిరుపతి సిటీ
తిరుపతి నగరంలోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ప్రథమ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ దసరా ఆఫర్లను ప్రకటించారు. షోరూమ్‌ వద్దకు చేరుకున్న ఆమెకు అభిమానులు, ఆ సంస్థ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. షోరూమ్‌ మొత్తం కలయ తిరిగి అక్కడ ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాలమైన ప్రాంతంలో తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అతి పెద్ద వస్త్ర షోరూంను ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి రామానుజన్‌ సర్కిల్‌ వరకు కొత్త రోడ్డు కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా లేవన్నారు. ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ కు విశాలమైన పార్కింగ్‌ సదుపాయం ఉన్నందున కొనుగోలుదారులకు ఎలాంటి సమస్యలూ ఉండవన్నారు. ఈ అవకాశాన్ని వస్త్రప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆ సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ తమ షో రూమ్‌ లో సారీస్‌ వేర్‌ మెన్స్‌ వేర్‌ లేడీస్‌ వెస్ట్రన్‌ వేర్‌ కిడ్స్‌ వేర్‌ చుడిదార్‌ లెహంగా లెగ్గింగ్స్‌ గౌన్లు బ్రాండ్‌ లేడీస్‌ వేర్‌ లో లేటెస్ట్‌ ట్రెండుకి అనుగుణమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దసరా సందర్భంగా వెయ్యి రూపాయలు విలువ చేసే ప్రతి కొనుగోలు పై స్పాట్‌ గిఫ్ట్లు అందిస్తున్నామన్నారు. ఎస్బిఐ కార్డు పై ఐదు శాతం క్యాష్‌ బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆకర్షణ నిమిత్తం వస్త్రాలు అతి తక్కువ ధరలకు ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్నామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ క్లస్టర్‌ మేనేజర్‌ నవీన్‌ కుమార్‌, నరసింహ, శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ వార్షికోత్సవంలో హీరోయిన్‌ అనుపమ