Oct 03,2023 21:06

రోడ్లను శుభ్రం చేస్తున్న సర్పంచి అరుణ్‌ కుమార్‌

ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో ఆర్‌డిటి స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో 'స్వచ్ఛతే సేవ'లో భాగంగా పరిశుభ్రత - శ్రమదానం నిర్వహించారు. మంగళవారం గ్రామంలోని ఎస్సీ కాలనీ ఎబిఎం చర్చి నుంచి గుడ్డెను బావి వరకు చీపురులతో రోడ్లపై ఉన్న చెత్తను సర్పంచి మొగతాల్‌ అరుణ్‌ కుమార్‌, ఆర్‌డిటి, పొదుపు గ్రూపు సభ్యులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. పొదుపు గ్రూపు సభ్యులు మాణిక్యమ్మ, రంగమ్మ, రత్నమ్మ, పద్మ, ఆర్‌డిటి సిబ్బంది నరసప్ప, నాగన్న, ఫిలిప్పీ పాల్గొన్నారు.