Oct 10,2023 00:40

స్థలాన్ని పరిశీలిస్తున్న జెసి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని నూతన ఆర్డీవో కార్యాలయానికి స్థల పరిశీలన జెసి శ్రీనివాసరావు సోమవారం చేపట్టారు. మండలంలోని స్థానిక తహసిల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలించిన జెసి శ్రీనివాస్‌ ఆర్డీవో కార్యాలయ ఏర్పాటును వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆర్డీవో కార్యాలయం శిధిలావస్థకు చేరడంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పై పెచ్చులు ఉడిపడి పోతుండటంతో భయంతో విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది జేసీకి తెలిపారు. అనంతరం నూతనంగా మరమ్మతులు చేపడుతున్న తహసిల్దార్‌ కార్యాలయం నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. తహసిల్దార్‌ కార్యాలయం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్‌ రాజలక్ష్మి, ఆర్‌ఐ రంగారావు, వీఆర్వో కొండబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.