Jul 03,2023 22:08

సమావేశంలో మాట్లాడుతున్న స్పెయిన్‌ దేశస్తుడు

బత్తలపల్లి : వెనుకబడిన ప్రాంతాలలో ఆర్డీటీ అందిస్తున్న తోడ్పాటును ఆసరాగా చేసుకుని పేద కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చినప్పుడే సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ ఆశయం నెరవేర్చినట్టేనని రీజనల్‌ డైరెక్టర్‌ ప్రమీల కుమారి అన్నారు. మండలంలోని కోడే కండ్ల గ్రామంలో లబ్ధిదారులు భాగస్వామ్యంతో ఆర్డీటీ నిర్మించిన 20 గృహాలను స్పానిష్‌ సభ్యులతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల ఆర్ధిక స్థోమతను మెరుగుపర్చడమే కాకుండా వారి పిల్లల విద్యకు కోట్లాది రూపాయలను ఆర్డీటీ ఖర్చు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బండి వీరనారప్ప, నాగరాజు, తిమ్మరాజు, ఈశ్వరయ్య, ఇంజనీర్‌ బాసీం, అంజలి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.