ప్రజాశక్తి-ఆలూరు
రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వానికి ప్రజా తిరుగుబాటు తప్పదని మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ కురువ జయరామ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, అల్లారుదిన్నె కురువ మల్లయ్య, కురువ దర్గన్న హెచ్చరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు టిడిపి రైతు కమిటీ తాలూకా అధ్యక్షులు కురువ దేవేంద్రప్ప ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జగన్‌రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. ప్రజల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే నేడు జగన్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీల సంక్షేమాన్ని పూర్తి విస్మరించిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని, ప్రజలు జగన్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సర్పంచులు సుధాకర్, శేషప్ప, ఎల్లప్ప, మండల కన్వీనర్ అశోక్ యాదవ్, రఘు ప్రసాద్ రెడ్డి, నారాయణ, ఎల్లార్తి దర్గన్న, టిడిపి జిల్లా నాయకులు నరసప్ప, కిషోర్, కొమ్ము రామాంజి, నాగరాజు, కమ్మరచేడు కుమార్, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, గూళ్యం కుమార స్వామి, ధర్మాన, ముద్ద రంగ, గూళ్యం రామాంజినేయులు, గాదిలింగ, మారెప్ప, గజ్జెళ్లి బొజ్జప్ప, రంగయ్య, లక్ష్మన్న, కెకెడి ఉచ్చ వీరప్ప, కురువ అయ్యళ్లి, వీరనాగప్ప పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కురువ జయరాం










