Apple iPhone సిమ్‌కార్డ్, నెట్‌వర్క్‌లతో పని లేదు.. సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనున్న యాపిల్
టెక్నాలజీ వరల్డ్‌లో అనేక నూతన ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా యాపిల్ నిలిచింది. మార్కెట్లో ఏదైనా కొత్త ఫీచర్ వచ్చిందంటే అది యాపిల్ నుంచే మొదట ప్రారంభమవతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే.. మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, టాప్‌నాచ్ ఇలా ఒకటా రెండా.. ట్రెండింగ్ ఫీచర్లలో సగానికిపైగా యాపిల్ నుంచే వచ్చాయి అంటే ఆశ్చర్యం లేదు. యాపిల్ తెచ్చిన కొత్త ఫీచర్లే.. కొన్ని కంపెనీలు అనుసరిస్తాయి. ఇప్పుడు అన్నింటికీ మించి పాత్ బ్రేకింగ్ ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తేనుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు అన్నీ కూడా.. నెట్‌వర్క్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. 2జీ నుంచి 5జీ వరకు వచ్చాం. ఈ ఫోన్లనీ కూడా శాటిలైట్ తరంగాల ఆధారంగా ప్రత్యేక ఫ్రీక్వెన్సీలోనే పనిచేస్తున్నాయి. ఇప్పుడున్న ప్రస్తుత నెట్‌వర్క్‌ను మించి.. భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ టెక్నాలజీలో సిమ్‌తో అవసరం లేకుండా.. నేరుగా హ్యాండ్‌సెట్ ద్వారానే ఇటు కాల్స్, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్ కొనసాగించవచ్చు.
లియో నెట్‌వర్క్ అంటే..?
ఇప్పటివరకు నెట్‌వర్క్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ప్రస్తుతం భూ వాతావరణం ఆవల ఉన్న శాటిలైట్లను ఉపయోగిస్తున్నారు. ఇకపై అలాంటి నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా.. కేవలం భూమి నుంచే 500 కి.మీ ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్లను మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించుకోబోతున్నారు. లియో టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.. 90వ దశకం నుంచి అందుబాటులో ఉంది. అయితే ఇటీవలే ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకునేలా అనుమతులు జారీ అవుతున్నాయి. అమెజాన్, ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్, టాటా, టెలిశాట్ వంటి కంపెనీలు ఈ టెక్నాలజీ ప్రయోగించేందుకు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తరపున భారత్ బ్రాడ్ బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బిబిఎన్‌ఎల్) సైతం ఇదే టెక్నాలజీపై ఆధారపడి పని చేయనుంది.

లియో టెక్నాలజీని ఐఫోన్ 13తో పరిచయం చేయనున్న యాపిల్
లియో టెక్నాలజీని ముందుగా యాపిల్ పరిచయం చేసేందుకు అడుగులు వేస్తోందని తెలుస్తోంది. త్వరలో విడుదల చేయబోతున్న యాపిల్ 13 మోడల్ ద్వారా లియో టెక్నాలజీని పరిచయం చేయనున్నట్లు మార్కెట్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. మొబైల్ ఆపరేటర్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న ఛార్జీలేనా..? లేక ప్రత్యేకమైన ఛార్జీలు చెల్లించాలా? లేక హ్యాండ్‌సెట్ ధరలోనే అన్నీ పొందుపరుస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ మీడియాలో వార్తలొచ్చానా.. ఈ వార్తలపై ఇప్పటివరకు యాపిల్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.











