- అంబేడ్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇచ్చిన ఎపి జి ఈ ఏ, సంఘ నాయకులు
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : సిపిఎస్ విధానాన్ని, రద్దు చేసి ఒ పి ఎస్, పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎపి జిఈఏ, జిల్లా అధ్యక్షులు పి.రాము ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మి టాకీస్ సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేశారు. ఉద్యమ కార్యాచరణలో బాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అంబేద్కర్ రచించిన రూపొందించిన రాజ్యాంగ సూత్రాల ప్రకారం గా ఉద్యోగులకు కల్పించిన రాయితీలు ప్రయోజనాలు ప్రభుత్వం అమలు చేసేవిధంగా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే కాలానుగుణంగా ఎప్పటి డిఎ అప్పుడు మంజూరు అయ్యేటట్టు చూడాలని, పిఆర్సి ప్రకారంగా అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందేటట్టు చూడాలని డిమాండ్ చేశారు. వీటన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయుచున్న ఎక్కువ మంది ఉద్యోగులు ఓ పి ఎస్ అమలయితేనే ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగులు ఆత్మాభిమానంతో బతికేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి గ్యారంటీ స్కీం లేకుంటే చాలా హీనంగా మనుగడ కొనసాగించాల్సి వస్తుందన్నారు. దానిలో భాగంగా ప్రస్తుతం 2004 అనంతరం నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానమైన సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం లోపం నేటికి చట్టం చేయబడనందున దీనిని రద్దు పరచి ఓ పి ఎస్ ను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవలసినదిగా ప్రార్థిస్తూ ఈ పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి తోట వరప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, సాయిరాం నాయక్, పవన్ కుమార్, శివరామకృష్ణ మచిలీపట్నం తాలూకా ప్రెసిడెంట్ పరమేశ్వర రావు ఆర్గనైజింగ్ కార్యదర్శి, సలీం ,తాలూకా వైస్ ప్రెసిడెంట్ లు రామ్ కుమార్, రవీంద్రబాబు, రవికుమార్, సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, రత్నకుమారి, ఇదైతుల్లా, సుభాన్, ఏడుకొండలు, కృష్ణ, కిరణ్, రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.










