ప్రజాశక్తి - కలిదిండి
కాల క్రమంలో ప్రకృతికి అనుగుణంగా చెట్లకు పువ్వులు పూయడం సహజ లక్షణం. ఉగాది పండుగ సమయానికి వేప చెట్టుకు వేప పువ్వు పూయడం, తెలుగు వారి కొత్త సంవత్సరం నాడు ఉగాది పచ్చడి లోని ఆరు రుచులలో వేప పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ కాలానికి భిన్నంగా ఓ వేప చెట్టు కొమ్మకు వేప పువ్వు ముందే పూసింది. ప్రధాన సెంటర్‌లోని బద్రిరాజు కాంప్లెక్స్ వెనుక ఖాళీ స్థలం ఆవరణలో వేప చెట్టుకు(ఒక కొమ్మకు మాత్రమే) వేప పువ్వు పూసింది. ఉగాదికి ఆరు నెలల ముందుగానే పూయడం విశేషం.










