ప్రజాశక్తి-హాలహార్వి : మండల కేంద్రమైన హాలహార్వి ఏఓ కార్యాలయం ముందు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు ఈ ఏడాదీ ఖరీఫ్ సీజన్లో సరైన వర్షలులేక పంటలు ఎండిపోయాయి. పత్తి, ఉల్లి తదితర పంటలను చెడిపి పప్పుశెనగపంట వేయుటకు రైతులు సిద్దంగా ఉన్నారు. పెట్టిన పెట్టుబడీ కాదు కదా కనీసం విత్తనాల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. కావున తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎకరాకు ముప్పైవేల నుంచి యాబై వేల వరకు ఇవ్వాలి. రైతులకు రెండు లక్షలు రుణమాఫీ ఇవ్వాలి. ఉచితంగా పప్పు శనగ పంపిణీ చెయ్యాలని ఉపాధి హామీ పథకం 200 రోజులు కల్పించాలి. ఇన్సూరెన్స్ జీవో నెంబర్ 660 రద్దు చేయాలి గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాతో సంబంధం లేకుండా అమలు చేయాలి. వేదవతి నగరడొన రిజర్వాయర్లు తక్షణమే పూర్తి చేయాలి. ఏబీసీ కాలువ చివరి ఆయకట్టు వరకు మీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం అధ్యక్షుడు బీమా రైతు సంఘ కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు.










