Oct 23,2023 10:55

తాడేపల్లి : ప్రజలకు అండగా ఉంటామనే భరోసాను పోలీసులు ఇవ్వాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముందుగా వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను జాగ్రత్తగా ఎదుర్కొంటూ, ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని, ఫిర్యాదు వచ్చిన మరుక్షణం సీరియస్ గా స్పందించాలని డీజీపీ తెలిపారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 24 లక్షల మంది మహిళలు దిశా యాప్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా అసత్య ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సైబర్ నేరాలు, లోన్ యాప్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.