Jul 28,2022 18:08

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. బహిష్కృత మంత్రి పార్థా చటర్జీ సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీకి చెందిన మరో నివాసంలో ఇడి సోదాలు జరుగుతున్నాయి. బుధవారం అర్పితా అపార్ట్‌మెంట్‌లో ఇడి సోదాలు చేపట్టి.. సుమారు 30 కోట్ల రూపాయలు వెలికితీసిన సంగతి విదితమే. గురువారం కోల్‌కతాలోని చినార్‌ పార్క్‌ వద్ద ఉన్న మరో అపార్ట్‌మెంట్‌కు ఇడి అధికారులు చేరుకున్నారు. వారి వెంట సెంట్రల్‌ ఫోర్స్‌ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాల నియమకాలకు సంబంధించిన పార్థా చటర్జీ భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఇడి సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రితో పాటు, అర్పితా నివాసాల్లో సోదాలు చేపట్టగా.. తొలుత సుమారు 21 కోట్ల రూపాయాలను ఇడి స్వాధీనం చేసుకుంది.