ప్రజాశక్తి-గుంతకల్ : కరువు మండలంగా ప్రకటించి, రైతుల అప్పులు మాఫీ చేసి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానిక MRO, గారికి, కసాపురం సచివాలయం అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2023లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావంతో రైతులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు 9.15 లక్షల ఎకరాలు అయితే, 6.22 కూలీలు లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు సాగు చేశారు. గత జూన్ జులై, ఆగస్టు నెలలో 210.1 మి.మీటర్లు గాను 135.1 మి.మీటర్లు మాత్రమే నమోదైయింది. 35.7 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయినది. ప్రధాన పంటలు వూడలు దిగే సమయంలో ఆగస్టులో 83.8 మి.మీటర్లు గాను 83 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయినది. పూర్తిగా వర్షాలు రాకపోవడంతో సాగుచేసిన వేరుశనగ ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో వర్షం పడినా, దిగుబడులు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి పంటలను సాగుచేస్తే కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తేలియక, దిక్కుతోచని పరిస్థితులలో రైతాంగం వుంది. కావున రైతులను, కూలీలను ఆదుకోవడానికి ఈ క్రింది డిమాండ్స్ను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము.
డిమాండ్స్
1. ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలి.
2. పంట రుణాలు మాఫీ చేయాలి.
3. పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు కనీసం ఎకరాకు 50 వేలు, విత్తనం వేయని రైతులకు ఎకరాకుకరువు మండలంగా 30 వేలు ఇవ్వాలి.
4. వ్యవసాయ కార్మికుల జీవనోపాధికి ప్రతి కుటుంబానికి 25 వేలు ఆర్థిక సహాయం ఉపాధి హామి పథకంలో అదనంగా 100 రోజులు పనులు పెట్టాలి.
అందించాలి.
5. కౌలు రైతులకు, కౌలు రద్దుచేసి, నష్టపరిహారం ఇవ్వాలి.
6. పంటల భీమాలో (ప్రైవేటు ఇన్సురెన్స్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొని ప్రభుత్వ రంగంలోని భీమా కొనసాగించాలి.
7. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇవ్వాలి. స్మార్టు మీటర్లు బిగింపు ఆపాలి.
8. రబీలో పప్పు శెనగ 90 శాతం సబ్సిడితో ఇవ్వాలి.
9. ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలు రైతు కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.
10. తెల్లరేషన్ కార్డు వున్న వారందరికి బియ్యం, కందిపప్పు, గోదుమలు, చక్కెర, మంచినూని వంటి 14. రకాల నిత్యవసర సరుకులు చౌకడిపోల ద్వారా అందించాలి.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శ వర్గ సభ్యులు జగ్గలి రమేష్, కసాపురం రమేష్, పట్టణ కమిటీ సభ్యులు జాకీర్ తిమ్మప్ప, రాము, నాయక్, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దాసరి చరణ్, మద్దికేర ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.










