అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు నేషనల్ అస్సెమెంట్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్)కు సెల్ఫ్ స్టడీ నివేదికను విజయవంతంగా సమర్పించామని జెఎన్‌టియు ఉపకులపతి జి. రంగజనార్ధన తెలిపారు. బుధవారం నాడు ఉపకులపతి కాన్పరెన్స్ హాలులో యూనివర్సిటీ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం విసి మాట్లాడుతూ మార్చిలో ఇన్‌స్ట్యూషనల్ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ అస్సెమెంట్ సమర్పించామన్నారు. దీనిని జూన్‌లో అంగీకరించారని తెలిపారు. బుధవారం నాడు సెల్ఫ్ స్టడీ రిపోర్టును సమర్పించామని చెప్పారు. దీనికి సంబంధించి డిజిటల్ ఎవాల్యూషన, వెరిఫికేషన్‌ను న్యాక్ టీమ్ చేస్తారనన్నారు. అనంతరం న్యాక్ ఫిజికల్ టీమ్ యూనివర్సిటీని సందర్శించి, గ్రేడ్ ఇస్తారన్నారు. న్యాక్ నివేదిక విజయవంతంగా ఇవ్వడంలో కషి చేసిన ఐ క్యూసి డైరెక్టర్ జివి.సుబ్బారెడ్డి, బృందం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సి.శశిధర్, ఇ.కేశవరెడ్డి, బి.ఈశ్వర్ రెడ్డి, సి.శోభాబిందు, పి.సుజాత, ప్రిన్సిపాల్ ఎస్‌వి.సత్యనారాయణ , వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణ కాంతి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రకేసరికి నివాళి
ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులుకు నాడు బుధవారం అనంతపురం జెఎన్‌టియు పరిపాలన భవనంలో ఘన నివాలులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విసిరంగజనార్ధన, ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య సిశశిధర్ తదితరులు పాల్గొన్నారు.










