విరాళం అందజేస్తున్న బత్తల హరిప్రసాద్
కదిరి అర్బన్ : పట్టణంలోని కోనేరు కట్ట వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జులై మూడవ తేదీన జరిగే గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్, సీనియర్ నేత డాక్టర్ బత్తల వెంకటరమణ విరాళం అందజేశారు. ఈ మేరకు వారు రూ. 50వేలను కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దశరథ నాయుడు, పురుషోత్తం రెడ్డి, రామ్ కిషోర్ రెడ్డి, అంజి వాల్మీకి, కాయల జనార్దన్ నాయుడు, కొమ్మువిజయ భాస్కర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










