ప్రజాశక్తి - చిప్పగిరి
నేమకల్లు పంచాయతీలోని మజరా గ్రామమైన సంగాల గ్రామంలో ఈనెల 24న ఆంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన చేస్తుండగా భక్తులకు, ప్రజలకు అన్నదానానికి జడ్‌పిటిసి విరుపాక్షి రూ.20 వేల విరాళం అందజేశారు. అన్నదానానికి సహాయం అందించాలని సంగాల గ్రామ పెద్దలు జడ్‌పిటిసి విరుపాక్షిని కోరారు. బుధవారం జడ్‌పిటిసి విరుపాక్షి సంగాల గ్రామానికి వెళ్లి విగ్రహ ప్రతిష్టాపన చేసే దేవాలయాన్ని పరిశీలించి ఆ గ్రామ పెద్దలకు రూ.20 వేలు విరాళంగా అందజేశారు. జడ్‌పిటిసి విరుపాక్షికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపిటిసి భీమలింగ, గ్రామ పెద్దలు పూలమాల, శాలువా వేసి సన్మానించారు. సుంకులమ్మ అవ్వ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసిపి మాజీ కన్వీనర్ ఓబులేసు, మాజీ ఎంపిటిసి మల్లికార్జున, వాల్మీకి మండల అధ్యక్షులు లోకనాథ్ పాల్గొన్నారు.
సంగాల గ్రామ పెద్దలకు నగదను అందజేస్తున్న విరుపాక్షి










