ఇంటర్నెట్ డెస్క్ : వినియోగదారులు... అపనమ్మకం ఉన్న వినియోగదారుల నుంచి తమ సమాచారాన్ని దాచుకునేవిధంగా కొత్త ఆప్షన్స్‌తో వాట్సాప్ మీ ముందుకు రానుంది. వాట్సాప్‌లోని వాబెటాఇన్‌ఫాం ద్వారా వాట్సాప్ వినియోగదారులు తమ ప్రొఫైల్‌ని ఎవరు చూడాలనుకుంటున్నారో ముందే వారిని నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ తమ ప్రొఫైల్‌ని చూసినా.. వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచే అవకాశం ఉంది. ఇది కేవలం సమాచారానికి మాత్రమే కాదు.. లాస్ట్‌సీన్, ప్రొఫైల్ పిక్చర్స్‌్‌కు రాబోయే టూల్‌తో గోప్యంగా భద్రంగా ఉంచే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
సరికొత్త ఫీచర్‌తో చివరిసారిగా చాట్ చేసుకున్నది వాట్సాప్ వినియోగదారు .. గ్రూపు జాబితా నుంచి సమాచారాన్ని దాచిపెడితే.. వాట్సాప్ వారి మొత్తం సమాచారాన్ని దాచిపెట్టుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఐఓఎస్‌లో కనిపించినప్పటికీ, తర్వాతర్వాత.. స్మార్ట్‌ఫోన్‌లకు రానుంది. అలాగే వాట్సాప్ ఫీచర్లలో... గతంలో పాపులర్ అయిన మెసేజ్‌ని ఒకసారి చూసిన తర్వాత అది షిఫ్ట్ డిలీట్ అవుతుందని.. కేవలం ఒక్కసారే చూసేవిధంగానే పనిచేస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే.










