Sep 23,2023 18:02

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
   అనారోగ్యంతో బాలుడు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని తాటియాకులగూడెంలో చోటు చేసుకుంది. మామిళ్ల జస్వంత్‌(8) అనే బాలుడు గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ అశ్వారావుపేట ప్రెయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెంలోని జాబిల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తెల్లవారు జామున మృతి చెందాడు. అల్లారు ముద్దుగా తిరిగే బాలుడు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.