Sep 19,2023 19:48

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి స్థానిక డాంగేనగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో దాత రక్తదానం చేసి జౌదార్యం చాటుకున్నారు. మంగళవారం పట్టణంలోని ఒక ప్రెయివేటు ఆసుపత్రిలో తీవ్ర జ్వరంతో చికిత్స పొందుతున్న 11 ఏళ్ల బాలుడికి ప్లేట్‌ లెట్స్‌ పడిపోయి బ్లడ్‌ అవసరమైంది. స్థానిక ప్రెయివేటు బ్లడ్‌ బ్యాంక్‌ను ఆశ్రయించగా సుమారు రూ.11,500 ఖర్చు అవుతుందని తెలిపారు. బాలుడు తరపున వారు ఎవరైనా రక్తం దానం చేస్తే రూ.9,500 ఖర్చు వుంటుందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు దాసరి నాగరాజు సమస్యను తెలుసుకుని రక్తదానం చేసి ఔదార్యం చాటుకున్నారు. దీంతో డాంగేనగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు, స్థానికులు దాసరి నాగరాజును అభినందించారు.