Apr 20,2023 22:24

హోంగార్డులతో మాట్లాడుతున్న కమాండెంట్‌

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : అంకితభావంతో పనిచేయాలని హోంగార్డుల కమాండెంట్‌ మహేష్‌ కుమార్‌ హోంగార్డులకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం కదిరి పట్టణంలో హోంగార్డులతో మార్చు ఏర్పాటు చేశారు. హోంగార్డుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా విధి నిర్వహణ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమలో హోంగార్డుల జిల్లా అధికారి శ్రీశైలం రెడ్డి, శ్రీరాములు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.