ఎస్‌ఐ షేక్ జానీబాషా పనితీరుపై ప్రశంసలు
ప్రజాశక్తి -మామిడికుదురు
విధి నిర్వహణలో ఉన్న అధికారులు అంకితభావంతో పనిచేస్తే చిరస్థాయిగా నిలుస్తారని పి.గన్నవరం సిఐ ప్రశాంత్‌కుమార్ అన్నారు. నగరం పోలీసు స్టేషన్‌లో రెండు సంవత్సరాల రెండు నెలలు పాటు ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ బదిలీపై పామర్రు వెళ్తున్న ఎస్‌ఐ షేక్ జానీబాషా వీడ్కోలు సభ ఆదివారం రాత్రి స్టేషన్ అవరణలో నిర్వహించారు. ఎస్‌ఐ జానీబాషా దంపతులను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... ఎస్‌ఐ జానీబాషా పనితీరుపై ప్రశంసలు కురిపించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలు అద్భుతమని కొనియాడారు. అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న ఎస్‌ఐ జానీబాషా భవిష్యత్‌లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. గతేడాది గోదావరి వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్వయంగా తానే గుండెల్లోతు వరద నీటిలో వెళ్లి బాధితులను రక్షించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో రెండేళ్ల పాటు తనకు అన్ని విధాలా సహకరించిన ప్రజా ప్రతినిధులకు, మీడియా సిబ్బందికి, అధికారులకి, స్టేషన్ సిబ్బందికి, మండల ప్రజలకు ఎస్‌ఐ జానీబాషా కతజ్ఞతలు తెలియజేశారు










