అంగన్వాడీల దీక్షలో కూర్చొన్న పల్లె రఘునాథరెడ్డి
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం రెండు రోజులపాటు నిర్వహించిన అంగన్వాడి కార్యకర్తల పోరాటాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన దీక్ష శిబిరానికి మంగళవారం అతని అనుచరులతో చేరుకొని వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాలన్నారు. ఈ ప్రభుత్వానికి మాటలు చెప్పడమే తప్ప చేతలు చేయడం చేత కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు అంగన్వాడీల వద్ద కూర్చుని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్ రామాంజనేయులు, దయ్యాల ఉమాపతి, తదితరులు పాల్గొన్నారు.










