Sep 25,2023 20:53

గుంతకల్‌ పోలీసుల అదుపులో ఉన్న అంగన్వాడీలు

ప్రజాశక్తి - కోసిగి
అంగన్వాడీల అరెస్టు అప్రజాస్వామికమని సిఐటియు నాయకులు సోమవారం విమర్శించారు. అంగన్వాడీ, కార్యకర్తలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 'చలో విజయవాడ'కు వెళ్తున్న అంగన్వాడీలను అరెస్టులు చేయడం ఆప్రజాస్వామికమని సిఐటియు మండల నాయకులు రాముడు, శాంతరాజు, హెప్సిభా రాణి, లూసమ్మలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అతి తక్కువ వేతనం ఇస్తూ పని భారం పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు వేతనం పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.