Oct 14,2023 18:00

ప్రజాశక్తి - ఉంగుటూరు
   ఉంగుటూరు మండలం కైకరంలో రెండు అంగన్‌వాడీ సెంటర్లను విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు కోనే వీర వెంకట సత్యనారాయణ శనివారం తనిఖీ చేశారు. స్టాక్‌, రికార్డ్స్‌ పరిశీలించారు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం కూడా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయమైన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు తోట దుర్గ, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.