తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది
ప్రజాశక్తి- దేవనకొండ
రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని తహశీల్దార్ వెంకటేష్ నాయక్ సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న తహశీల్దార్ కార్యాలయాన్ని వైఎస్‌ఆర్ క్రాంతి పథం భవనాలకు మరమ్మతులు చేయించి సోమవారం తహశీల్దార్ కార్యాలయాన్ని మార్చారు. పేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించి కార్యాలయంలోకి రికార్డులు, సామగ్రిని మార్చారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. డిప్యూటీ తహశీల్దార్ సుదర్శనం, విఆర్‌ఒలు, విఆర్‌ఎలు, సిబ్బంది పాల్గొన్నారు.










