ప్రజాశక్తి - మంత్రాలయం
రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా బాగుండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సంత మార్కెట్ ఆవరణంలో ఎంపిడిఒ మణిమంజరి అధ్యక్షతన 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయి మాట్లాడారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష' ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. దీని ద్వారా పేదలు వైద్య సేవలు పొంది, ఉచితంగా మందులు పొందారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని కర్నూలుకు కూడా పంపిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ప్రజల సేవకే అంకితమైన రాంపురం రెడ్డి సోదరుల తరఫున రానున్న ఎన్నికల్లో నాలుగో సారీ తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వైద్య సేవలు పొందుతున్న వారితో ముచ్చటించి వైద్య సేవలపై అభిప్రాయం తెలుసుకున్నారు. ఐసిడిఎస్ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి, గర్భిణులకు నిర్వహించిన సీమంతంలో ఆశీస్సులు అందించారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, సర్పంచి భీమయ్య, ఉపసర్పంచి హోటల్ పరమేష్ స్వామి, వైస్ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, ఎంపిటిసి జి.వెంకటేష్, మాజీ ఉప సర్పంచి గోర్కల్ కృష్ణస్వామి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, నాయకులు శివకుమార్, జనార్ధన్ రెడ్డి, వికెసి.రఘు, తహశీల్దార్ చంద్రశేఖర్, కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. హోళగుంద మండలంలోని మర్లమడికి గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. 357 మంది రోగులను గుర్తించి వారికి ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు. తహశీల్దార్ హుస్సేన్ సాబ్, ఎంపిడిఒ సుహాసీనమ్మ, ఇఒఆర్‌డి చంద్రమౌళీశ్వర గౌడ్, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ షఫీ, వైసిపి నాయకులు రమేష్, చంద్రశేఖర్, బీరప్ప పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి










