ప్రజాశక్తి-బలిజిపేట : మండలంలోని చిలకలపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్) కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు తనిఖీ చేశారు. ఎంపిడిఒ కె.విజయలక్ష్మితో కలిసి ప్రతి కౌంటర్ వద్ద ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ స్టాల్‌ను పరిశీలించి ఎంతమంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అలజంగి సుందరరావు, ఎంపిటిసి బోనెల మల్లిక, ప్రసాదరావు, పిహెచ్‌సి వైద్యాధికారులు డి.క్రాంతి కిరణ్మయి, శశిధర్, స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ దుర్గాప్రసాద్, పంచాయతీ సెక్రటరీ ఎ.రామకృష్ణ, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
వీరఘట్టం : అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ అన్నారు. గురువారం మండలంలోని చిదిమిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు వీటిని ప్రతి ఒక్కరు స్పదినియోగం వేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపిపి డి.వెంకటరమణనాయుడు, సర్పంచులు ధమలపాటి ఉమా మహేశ్వరరావు, ఎస్.లక్ష్మి సింహాచలం, ఎంపిడిఒ వై.వెంకటరమణ, వైద్యాధికారులు పి.ఉమామహేశ్వరి, ఎ.మానస, ఎంఇఒ ఆనందరావు, వైసిపి నాయకులు పాలవలస ధవళేశ్వరరావు, వైద్య, సచివాలయ సిబ్బందితో పాటు గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పాలకొండ : జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు రక్ష అని ఎమ్మెల్యే వి.కళావతి, మండలి విప్ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని బెజ్జిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి బొమ్మల భాను, వైస్ ఎంపిపి సూర్యప్రకాష్, ఎంపిడిఒ ఉమామహేశ్వరి, సర్పంచులు సివ్వల శ్రీనివాసరావు, ఉపేంద్ర, కె.సూర్యనారాయణ, కొండలరావు తదితరులు ఉన్నారు.
పార్వతీపురం రూరల్: మండలంలోని డోకిసీల పిహెచ్‌సి పరిధిలోని తాళ్లబురిడి లో జెఎఎస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్స్ చూశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ అకిబ్ జావేద్, వైద్యాధికారులు డాక్టర్ భాస్కరరావు, జెడ్పీటీసీ బలగ రేవతమ్మ, ఎంపిపి మజ్జి శోభారాణి, ఎంపిటిసి సభ్యులు మర్రాపు వాసుదేవరావు, వైస్ ఎంపిపిలు సిద్ధా జగన్నాధరావు, బంకురు రవికుమార్, నాయకులు బొమ్మి రమేష్, భీమవరపు కృష్ణమూర్తి, మడక విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని కోటసీతారాంపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్) కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు తనిఖీ చేశారు. ప్రతీ కౌంటర్ వద్ద ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఇంటింటి ఆరోగ్య సర్వే లో ఎంతమందికి టోకెన్లు అందజేశారని, శిబిరం వద్ద కొత్తగా ఎంత మందిని నమోదు చేశారని వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. ముఖ్యంగా జెఎఎస్‌లో ఆరోగ్య తనిఖీల్లో కొత్తగా గుర్తించిన బిపి, మధుమేహం, రక్త హీనత గల కిశోర బాలికలు, కఫం పరీక్షల ద్వారా కొత్తగా నమోదైన క్షయ వ్యాధి గ్రస్తులు, కళ్ల తనిఖీలకు వచ్చినవారిలో కేటరాక్ట్ ఆపరేషన్లకు ఎంత మందిని గుర్తించారు, రిఫరల్ అవసరమైన వారిని పర్యవేక్షణ, కొత్తగా గుర్తించిన లెప్రసీ లక్షణాలు ఉన్నవారు, పిల్లల్లో పుట్టుక లోపాలు గుర్తించడం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ స్టాల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో పి హెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్ ఎం.రాధాకాంత్, డాక్టర్ ఉషారాణి, స్పెషలిస్ట్ వైద్యులు, పంచాయతీ సెక్రటరీ కామేశ్వరరావు, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
భామిని : బాలేరు పిహెచ్‌సి పరిధిలోని కొసలిలో వైద్యాధికారులు దీపిక రాణి, శివ కుమార్ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కొసలి సర్పంచ్ మజ్జి మోహన్‌బాబు మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో నిపులులైన వైద్యులు చేత అందిస్తున్న వైద్య సేవలను అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 469 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మెరుగైన వైద్యం కోసం 11మందిని రిఫరల్ చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ అప్పారావు, ఆర్‌ఐ రాంబాబు, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని రావుపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జెడ్‌పి వైస్‌చైర్మన్ ఎం.బాపూజీనాయుడు సందర్శించారు. ప్రజలు ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరంలో 550 ఒపిలు చూడడం జరిగిందని, వీరికి వివిధ రకాల మందులు ఇచ్చినట్టు వైద్యాధికారులు ఎ.ప్రియాంక తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపిపి ఉరిటి రామారావు, వైద్యాధికారులు డాక్టర్ కెకె సాగర్‌వర్మ, పలువురు వైద్యులు, ఎంపిడిఒ జి.పైడితల్లి, డిటి పిఎస్‌ఎల్ కుమార్, ఇఒపిఆర్‌డి గోపాలకృష్ణ, ఎఒ ఎన్.అర్జునరావు, పంచాయతీ సర్పంచ్ బి.మహేష్, తదితరులు పాల్గొన్నారు.










