ప్రజాశక్తి - పెద్దకడబూరు
వైసిపి ప్రభుత్వ హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కల్లుకుంట గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రతి కుటుంబానికీ న్యాయం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలు అందని వారికి త్వరలోనే అందేటట్లు చూస్తామని హామీఇచ్చారు. నాయకులు రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, సర్పంచి ఇస్మాయిల్, మాజీ సర్పంచి సత్యనారాయణ, బాలముని, డీలర్ నర్సింగప్ప, కటిక మహ్మద్, విజరు కుమార్, షేర్ ఖాన్, అమీర్ ఖాన్ పాల్గొన్నారు.
ప్రదీప్‌రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు










