ప్రజాశక్తి - సాలూరురూరల్ : ప్రభుత్వం అందించే పథకాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలోని పెదపదం పంచాయతీ పరిధిలోని పెదపదం, బాగువలసలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 199వ రోజు మండలంలో చివర రోజు ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రామానికి విచ్చేసిన ఆయనకు థింసా నృత్యం, కోలాటాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాగువలస ప్రధాన కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ ఏఏ పథకం కింద ఎంత మొత్తంలో అందుతున్నాయని బుక్‌లేట్ చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్‌పర్సన్ దండి అనంతకుమారి, జిల్లా గ్రంథలయ సంస్థ చైర్‌పర్సన్ రెడ్డి పద్మావతి, ఎంపిపి జి.రాములమ్మ, వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, వైస్ ఎంపిపి ప్రతినిధి సువ్వాడ భరత్ శ్రీనివాసరావు, సర్పంచ్ రెడ్డి సుకన్య, జెఎసి కన్వీనర్ కళ్లేపల్లి త్రినాథ్ నాయుడు, వైసిపి కార్యదర్శి దండి శ్రీనివాసరావు, ఎఎంసి వైస్ చైర్మన్ బాంకురు శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని వండువ ఆడారు గ్రామాల్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పి.విక్రాంత్ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోనే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమం పథకాలు గూర్చి ప్రజలకు వివరించారు. కార్య క్రమంలో సర్పంచ్‌లు ఎం.కల్యాణి, ఎన్.సుధారాణి, ఎంపిపి డి.వెంకట రమణ నాయు డు, జెడ్‌పిటిసి జంపు కన్న తల్లి- ఉమా మహేశ్వరరావు, మండల ఉపా ధ్యక్షులు పి.విజయ కుమారి, వి.భార్గవ్, పిఎసిఎస్ అధ్యక్షులు కె.గోవిం దరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కె.లీలాప్రసాద్, నీలం సత్యంనాయుడు, గణపతిరావు, తవిటినాయుడు, పివిఆర్ పురం సర్పంచ్ ఉదయాన జగన్మోహనరావు, సీనియర్ నాయకులు పాలవలస ధవళేశ్వరరావు, మాజీ సర్పంచ్ నీలం జయమ్మ, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










