అందరికీ ఆరోగ్య సేవలు అందించటమే లక్ష్యం
కపిలేశ్వరపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ బాలాజీ
ప్రజాశక్తి-పమిడిముక్కల
రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య, ఆరోగ్య సేవలు అందింటమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని కపిలేశ్వరపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ బాలాజీ అన్నారు. పమిడిముక్కల మండలంలోని కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో శుక్రవారంనాడు ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇంటింటికీ వైద్యం అందజేయటమే ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమ ముఖ్యఉద్ధేశ్యమన్నారు. సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇంటింటికి వైద్యం కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారన్నారు. నిరంతరం వివిధ రకాల సర్వేలు చేయటం ద్వారా రోగుల వివరాలను తెలుసుకుని ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్, వైద్య సిబ్బంది సుబ్బారావు, దేవకమలం సుమలత, జ్యోతి, మహాలక్ష్మి అంగన్వాడీ సిబ్బంది వీర కుమారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.










