Jul 06,2023 22:23

సిడిపిఒకు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు, అంగన్వాడీ నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు ఈ నెల 10, 11వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ ఆందోళనకు అనుమతులు ఇవ్వాలని ఐసిడిఎస్‌ సిడిపిఒ రెడ్డి రమణమ్మను సిఐటియు నాయకులు కోరారు. ఈ మేరకు వారు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప మాట్లాడుతు 10, 11వ తేదిల్లో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో అంగన్వాడీ వర్కర్లు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు శోభారాణి, ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య, కోశాధికారి శిరీష, సెక్టార్‌ లీడర్లు శైలమ్మ, విజయమ్మ, వరలక్ష్మి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.