Aug 25,2023 21:06

అంబేద్కర్‌ విగ్రహం వద్ద నివాళ్లు అర్పిస్తున్న అక్కివరపు

ప్రజాశక్తి- సీతానగరం :   స్థానిక దళిత వాడలో శుక్రవారం పుచ్చల రామారావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు పుచ్చల నాగేశ్వరరావు అలియాస్‌ పండు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విజిలెన్స్‌కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ రాజు వెంకట్రావు, దళిత సామాజిక జాతీయ అధికార ప్రతినిధి అక్కివరపు మోహనరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రఖ్యాతగాయించి భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కొనియాడారు. ప్రతి ఇంటిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ఆశయాలను ముందుకు నడిపించడం ద్వారా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. దళిత నాయకులు వై.గోపి, దళిత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు ఎస్‌ వెంకట్రావు, ఎ.మోహనరావు, దళిత నాయకులు, గ్రామ సర్పంచ్‌ ఆర్య సమాజ ప్రతినిధులు, గ్రామస్తులు, బహుజన నాయకులు పాల్గొన్నారు.