ప్రజాశక్తి గుడిబండ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలోని మహిళలు జ్యోతులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు..అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ భూతరాజు. సింగల్ విండో అధ్యక్షుడు చంద్రప్ప, ఎస్సీ సెల్ అధ్యక్షులు రమేష్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు హనుమంతరాయప్ప, పాతయ్య తదితరులు పాల్గొన్నారు.










