Jul 19,2023 22:55


ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : అమరావతి ప్రాంతంలో ఇళ్లస్థలాలు కేటాయించిన పేదలకు ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించిన ఇల్లు కట్టించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయదని పామర్రు శాసనసభ్యులు, శాసనసభ హామీల కమిటీ చైర్మన్‌ కైలే అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని రహదారులు భవనాలు అతిధిగహంలో వారు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దళితుల పక్షపాతి అని వారిని అక్కున చేర్చుకుని ప్రోత్సహించి పైకి తేవాలన్నదే వారి అభిమతం అన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చేసే ప్రయా ణంలో తాము సైనికులుగా వెన్నుదన్నుగా ఉండి పేదలకు ముఖ్యంగా దళితులకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ తామన్నారు. రాజ ధానిలో అన్ని వర్గాల ప్రజలు ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతి ఆర్‌ - 5 జోన్‌ లో పేదలందరికీ 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. వారందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం దఢ సంకల్పంతో ఉందని ఇందుకోసం షేర్‌ వాల్‌ టెక్నాలజీ వారితో ఒప్పందం కూడా చేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఇళ్ల నిర్మాణానికి అనుమతి తెచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదని సంక్షేమ కార్యక్రమాలు అన్ని అర్హత కలిగిన వారికి మాత్రమే పూర్తిగా నేరుగా వారికే జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అభివద్ధి కార్యక్రమాలు మరోవైపు చేపడుతుందన్నారు. రహదారుల నిర్మాణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు 5వేల మంది పాత్రికేయులకు కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరగా ఈ విషయం ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పామర్రు బస్టాండు కొన్ని సంవత్సరాల నుండి పట్టించుకోలేదని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దష్టికి తీసుకొని పోగా ఆయన వెంటనే స్పందించారని అక్కడ బస్టాండు చదును చేసి టెండర్లు ప్రక్రియ జరుగుతుందన్నారు.