Oct 21,2023 20:05

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మ వారిని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం స్థానిక మల్లారి వీధి సమీపంలో ఉన్న శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వెళ్లి అమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు కెపి.వీరన్న శెట్టి, మురారి రాజశేఖర్‌, ప్రవీణ్‌ కుమార్‌, కుమార్‌, వైసిపి నాయకులు దర్మకారి నాగేశ్వర రావు పాల్గొన్నారు.