ధర్మవరం టౌన్ : అమ్మ ఒడి పథకం చరిత్రాత్మకమని ఇది పేదల జీవితాలలో వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం అమ్మ ఒడి లబ్దిదారులతో కలసి భారీ ర్యాలీ చేపట్టారు. ఈనెల 28న అమ్మ ఒడి నిధుల విడుదల సందర్భంగా జగనన్నకు మద్దతుగా ఈర్యాలీని నిర్వహించారు. అనంతరం కళాశాల సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరక్ష్యరాస్యతను రూపు మాపేందుకు అమ్మ ఒడి పథకం ఉపయోగపడుతోందని అన్నారు. ఇప్పటి దాకా ఒక్క ధర్మవరం నియోజకవర్గంలో మాత్రమే పిల్లల్ని బడులకు పంపే తల్లుల ఖాతాలో రూ.162కోట్ల నిధులను జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు ఎర్రగుంట భాగ్యలక్ష్మి, పెణుజూరు నాగరాజు, తాడిమర్రి ఎంపీపీ పాటిల్ భువనేశ్వరరెడ్డి, బత్తలపల్లి మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










