ప్రజాశక్తి - ముసునూరు
అంగన్‌వాడీ కార్యకర్తగా 33 సంవత్సరాలు పనిచేసిన ఎన్.అంజనాదేవి సేవలు మరువలేనివని సెక్టార్ సూపర్‌వైజర్ కె.ధనలక్ష్మి కొనియాడారు. బుధవారం మండలంలోని గుళ్లపూడి గ్రామంలోని కోడు నెంబర్ 126లో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న అంజనాదేవి ఉద్యోగ పదవీ విరమణ చేస్తున్న శుభ సందర్భంగా భార్యాభర్తల ఇరువురును అంగన్‌వాడీ కార్యకర్తలు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు.










